కమల్ హాసన్ పిలిస్తే వెళతాను : షకీలా

Sunday, March 11th, 2018, 05:49:19 PM IST

రాజకీయాల్లో ఇప్పుడిపుడే అడుగులు వేస్తోన్న కమల్ హాసన్ సినీ రంగాల నుంచి ప్రశంసలు చాలానే అందుతున్నాయి. కోలీవుడ్ నుంచే కాకుండా టాలీవుడ్ లో కొంత మంది సినీ తారలు కమల్ రాజకీయాలను మెచ్చుకుంటున్నారు. ఇక రీసెంట్ గా శృంగార తార షకీలా కూడా కమల్ రాజకీయాలపై స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. కమల్ ఒక మంచి మానవత్వం కలిగిన వ్యక్తి. సామాన్య ప్రజలను విద్యా వంతులను చైతన్యవంతులను చేయాలనీ తరచు చెబుతుంటారు. ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనమంటే తప్పకుండా తాను వెళతాను అని షకీలా వివరించారు. అంతే కాకుండా కొన్ని అంశాలపై అవగహన కల్పించడం వల్ల మార్పు తీసుకురావచ్చు అని ఆ విధంగా మార్పు కోసం ప్రయత్నం చేస్తోన్న కమల్ పై నెగిటివ్ కామెంట్స్ చేయకూడదని రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తెలిపారు. ఇక ప్రస్తుతం షకీలా తన 250వ చిత్రం శీలవతి సినిమాతో బిజీగా ఉంది. త్వరలోనే ఆ సినిమా రిలీజ్ కానుంది.