షాకింగ్ న్యూస్ : శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు ఏ డైరెక్టర్ పైన?

Monday, April 2nd, 2018, 06:12:40 PM IST

ప్రస్తుతం టాలీవుడ్ లో రగులుతున్న ముఖ్యమైన అంశం కాస్టింగ్ కౌచ్. ఇప్పటికే పలువురు చిన్న హీరోయిన్ లు దీనిపై వ్యాఖ్యలు చేస్తుండగా హీరోయిన్ శ్రీ రెడ్డి మాత్రం తనలా మరొక అమ్మాయికి ఇలా జరగకూడదని, అందుకే తాను అందరిలా ఈ విషయాల్ని తేలిగ్గా తీసుకోవడం లేదని చెపుతోంది. అయితే ఇప్పటివరకు ఇండస్ట్రీ కి సంబంధించి ఎవరిపేర్లు బయటపెట్టని ఆమె. ఈ రోజు తన పేస్ బుక్ లో ఒక పోస్ట్ తో టాలీవుడ్ కు చెందిన ఒక ప్రముఖ డైరెక్టర్ పై తీవ్ర ఆరోపణలు గుప్పించింది. అయితే ఫేస్ బుక్ ద్వారా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మొత్తం టాలీవుడ్ లో కలకలం రేపుతున్నాయి. “పెద్ద డైరెక్టర్ అని పోజు.

అబద్ధాలు చెప్పడంలో దిట్ట. తెలుగు అమ్మాయిలంటే పక్కలోకి తప్ప ఎందుకూ పనికిరారని ప్రగాఢ విశ్వాసం. ప్రామిస్ లను బ్రేక్ చేయడంలో వీరి తర్వాతే ఎవరైనా. బక్కపీచు సోగ్గాడు. ఊదితే ఎగిరిపోయే ఇతనికి భయం, బలం రెండూ ఎక్కువే. టెక్నికల్ గా దొరక్కుండా, టెక్నాలజీని బాగా వాడాడు. మా ఇంటి కింద గూర్ఖాలా తిరిగేవాడు. వీడియో కాల్ కోసం ఏమైనా కోసేసుకుంటాడు పాపం. మగ ఆర్టిస్టుల దగ్గర డబ్బులు గుంజుతాడని టాక్. వీరెవరో కాదు కొమ్ములు వచ్చిన శేఖరుడు” అంటూ ఓ డైరెక్టర్ పై శ్రీరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అయితే ఆమె అంటున్న ఆ డైరెక్టర్ ఎవరా? అని నెటిజన్లు ఎవరికి వారు చర్చించుకుంటున్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments