శ్రద్దా పెళ్ళికి రెడీ ఆ..?

Sunday, April 29th, 2018, 05:37:56 PM IST

ప్ర‌భాస్ ప్ర‌ధాన పాత్ర‌లో సుజీత్ తెర‌కెక్కిస్తున్న సాహో చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది శ్ర‌ద్ధా క‌పూర్‌. ఈ మూవీతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది ఈ అందాల భామ‌. బాలీవుడ్‌లో సైనా నెహ్వాల్ బ‌యోపిక్‌తో పాటు బ‌త్తీ గుల్ మీట‌ర్ చాలూ, స్త్రీ చిత్రాలు చేస్తుంది. అయితే రీసెంట్‌గా లెహంగా ధ‌రించి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన శ్ర‌ద్ధా వాటికి అతి పెద్ద వేడుక కోసం అని కామెంట్ పెట్టింది. దీంతో నెటిజ‌న్స్ అంద‌రు శ్ర‌ద్ధా కూడా పెళ్ళి చేసుకోబోతుందా అంటూ చ‌ర్చ‌లు కొన‌సాగించారు. దీనిపై అల‌నాటి న‌టుడు, శ్ర‌ద్ధా తండ్రి శ‌క్తి కపూర్ స్పందించారు. ఏ తండ్రైన కూతురు మంచి వ్య‌క్తిని చేసుకొని పెద్ద కుటుంబంలోకి వెళ్లాల‌నుకుంటాడు. నా కోరిక అదే. ఈ రోజుల‌లో పెద్దోళ్ళు సంబంధాలు చూసి పెళ్ళి చేసే రోజులు పోయాయి. కాలానికి అనుగుణంగా మారాల‌నేదే నా ఆలోచ‌న కూడా. పెళ్లి విష‌యం త‌న‌కే వ‌దిలేస్తున్నాను. కెరీర్‌ప‌రంగా, జీవితం ప‌రంగా మంచి పొజీష‌న్‌లో ఉండాల‌నేదే నా ఆశ‌. ప్ర‌స్తుతం తాను వ‌రుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది. టైం వ‌చ్చిన‌ప్పుడు త‌న‌కి న‌చ్చిన వాడితో ఏడ‌డుగులు వేస్తుంది. ఈ విష‌యంలో మాకు ఎలాంటి అభ్యంత‌రం లేదు అని శ‌క్తి క‌పూర్ అన్నారు. ఇప్ప‌టికే బాలీవుడ్‌లో సోన‌మ్ క‌పూర్ -ఆనంద్ ఆహుజా, ర‌ణ్‌వీర్‌- దీపికల పెళ్లికి సంబంధించిన వార్త‌లు అభిమానుల‌లో ఆస‌క్తిని క‌లిగిస్తుంటే ఇప్పుడు శ్ర‌ద్ధా ఎవ‌రిని చేసుకోనుంది అనే దానిపై సస్పెన్స్ నెల‌కొంది.

  •  
  •  
  •  
  •  

Comments