కిస్సుల క్వీన్‌ని మెసేజ్‌ల‌తో వేదిస్తున్నారుట‌!

Sunday, October 22nd, 2017, 03:48:27 PM IST

క‌థానాయిక‌ల‌కు వీరాభిమానులు.. పిచ్చి అభిమానులు ఉంటార‌న్న సంగ‌తి తెలిసిందే. న‌చ్చితే చాలు ఎంత‌కైనా తెగించేసేందుకు రెడీ అయిపోతుంటారు. త‌మ అభిమాన నాయికను క‌లుసుకునేందుకు అంతే వెంపర్లాడిపోతుంటారు. అయితే సామాజిక మాధ్య‌మాల పుణ్య‌మా.. అని నాయిక‌ల‌తో ఫ్యాన్స్‌కి నేరుగా ఇంట‌రాక్ట్ అయ్యే అవ‌కాశం ద‌క్కుతోంది. అక్క‌డ త‌మ మ‌నసులో ఏం ఉందో సూటిగా చెప్పేసేందుకు ఆస్కారం క‌లుగుతోంది. వాటిలో కొన్ని వేదింపుల‌కు సంబంధించిన మెసేజ్‌లు వెళుతుంటాయి.

అయితే అలాంటి వేదింపులు కాదు కానీ, ఒకే ఒక్క సినిమాతో కిస్సుల క్వీన్‌గా పాపులారిటీ తెచ్చుకున్న షాలిని పాండే త‌న‌కి ఎదురైన ఓ వింత ప‌రిస్థితిని వెల్ల‌డించింది. ఫ్యాన్స్‌ నన్ను శాలిని అని కాకుండా బేబీ, ప్రీతీ అని పిలుస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. యూత్ అయితే పేరాల కొద్దీ మెసేజ్‌లు పెట్టేస్తున్నారు… అంటూ చెప్పుకొచ్చింది. అర్జున్ రెడ్డి సినిమాలో షాలిని న‌ట‌న‌కు మంత్ర ముగ్ధులైపోయారు కుర్ర‌కారు. అందుకే ఇలా మెసేజ్‌లు పెట్టేస్తున్నారా? అయితే ఆ మెసేజుల్లో ఎలాంటి సందేశం ఉందో మాత్రం అమ్మ‌డు చెప్ప‌లేదు. అర్జున్‌రెడ్డి చిత్రంలో షాలిని డేరింగ్ కిస్ సీన్స్ గుర్తు చేసుకుని ఇలా మెసేజ్‌లు పెట్టేస్తున్నార‌న్న‌మాట‌! మొత్తానికి కిస్సుల క్వీన్‌కి మెసేజ్‌ల బెడ‌ద మాత్రం త‌ప్ప‌డం లేదన్న‌మాట‌!

  •  
  •  
  •  
  •  

Comments