షాకింగ్ వీడియోలు : మహానటి స్నేహితురాలు షాలినీనా..?

Monday, May 7th, 2018, 04:10:22 PM IST

సావిత్రి బయోపిక్ మహానటి ఇంకా రెండే రోజుల్లో వచ్చేయనుంది. ఈలోపే ఒక్కో క్యారెక్టర్ను వీడియోల రూపంలో యూట్యూబ్లో పరిచయం చేస్తోంది చిత్ర యూనిట్. ఇదిగో ఇప్పుడు సావిత్రి ప్రాణ స్నేహితురాలు సుశీల వంతు వచ్చింది. చిన్నప్పట్నించి కలిసి పెరిగిన వారిద్దరి మధ్య బంధాన్ని మహానటిలో అందంగా చూపించారట. అయితే మరి సుశీల పాత్ర ఎవరు చేస్తున్నారు?

అర్జున్ రెడ్డితో మంచి హిట్ అందుకుంది షాలినీ పాండే. ఆమెకే సావిత్రి స్నేహితురాలు సుశీల పాత్ర దక్కింది. సావిత్రి బాల్యంలోని తీపి గురుతు ఈమె. పెరిగి పెద్దయ్యాక కూడా వీరి స్నేహం అలాగే కొనసాగింది. స్టార్ గా మారాక కూడా సావిత్రి స్నేహితురాలిని వదిలిపెట్టలేదు. ఆ స్నేహితురాలిగా అందంగా మెరిసింది షాలినీ. ఆమె గెటప్ కూడా సాంప్రదాయ బద్ధంగా మెరిసింది. నుదటు పెద్దబొట్టుతో తలనిండా మల్లెపూలతో ముఖమంతా అందమైన నవ్వుతో ఎరుపు చీరలో ఆకట్టుకుంది షాలినీ. ఆమెకు నిజంగా ఇది గుర్తుండిపోయే చిత్రమే అవుతుంది.

ఇలా ఎల్వీ ప్రసాద్ గా చేస్తున్న అవసరాల క్యారెక్టర్ ను అలమేలుగా నటిస్తున్న మాళవికా నాయర్ పాత్రను ఎస్వీరంగారావుగా చేస్తున్న మోహన్ బాబు పాత్రను ఇలా కొన్ని పాత్రలను వీడియోల రూపంలోనే పరిచయం చేశారు. అన్నట్టు ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కూడా ఈ సినిమాలో చిన్న పాత్ర చేస్తున్నాడు. ఆయన అలనాటి ప్రముఖ దర్శకుడు కేవీ రెడ్డిగా కనిపించనున్నారు. మాయా బజార్ వంటి అపురూప చిత్రాన్ని తీసింది ఆయనే.

  •  
  •  
  •  
  •  

Comments