అర్జున్ రెడ్డి సినిమాలో బాధతోనే నటించా : షాలిని పాండే

Tuesday, May 29th, 2018, 12:27:20 PM IST

అర్జున్ రెడ్డి సినిమాలో బేబీ అంటూ అందరిని ఆకర్షించిన నటి షాలిని పాండే. ఆ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే. ఆ విజయంతో షాలినికి మంచి ఆఫర్స్ అందాయి. ప్రస్తుతం కోలీవుడ్ లో కొన్ని సినిమాలు చేస్తోంది. అయితే రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో షాలిని పాండే ఎవరు ఊహించని విధంగా తనకు ఎదురైనా చేదు అనుభవాల గురించి చెప్పుకుంది. అర్జున్ రెడ్డి సినిమా షూటింగ్ సమయంలో తాను ఎంతో ఇబ్బంది పడ్డాను అని వివరించింది.

కాలేజ్ టైమ్ లో రెండు సార్లు లవ్ ఫెయిల్యూర్. అప్పుడు షూటింగ్ కూడా వెంటనే మొదలయ్యింది. అందువల్ల చాలా మనోవేదనకు గురయ్యాను. పైకి కనిపించకుండా హీరోతో సన్నిహిత సన్నివేశాల్లో నటించాల్సి వచ్చింది. అంతా బాధలోనే సినిమా షూటింగ్ ఎండింగ్ అయ్యింది. ఇక మా పేరెంట్స్ సినిమాల్లో నటించవద్దని చెప్పారు. అయినా కూడా గొడవపడి వచ్చేశాను. స్టార్టింగ్ దశలో చాలా ఇబ్బందులు చూడాల్సి వచ్చింది. ముంబై లో ఒంటరిగా ఉండే వారికీ అద్దె ఇల్లు ఇవ్వరు. నేను ఒక అమ్మాయి మరో ఇద్దరు అబ్బాయిలం ఉండేవాళ్లమని చెప్పిన షాలిని ఎప్పుడు వారితో తప్పుగా ఉండలేదని తెలిపింది.

  •  
  •  
  •  
  •  

Comments