మహేష్ సరసన అర్జున్ రెడ్డి భామ ?

Monday, April 9th, 2018, 02:09:08 PM IST

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ జనాలను ఆకట్టుకున్న షాలిని పాండే కి లక్కీ ఛాన్స్ దక్కినట్టే ఉంది. ఏకంగా ఈ అమ్మడు మహేష్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండతో పోటీ పడి ముద్దుల వర్షం కురిపించిన ఈ అమ్మడు యూత్ లో ఓ రేంజ్ పాపులారిటీ తెచ్చుకుంది. దాంతో ఈమెకు పలు అవకాశాలు క్యూ కట్టాయి. తాజగా మహేష్ 25 వ సినిమాలో ఓ హీరోయిన్ గా తీసుకోవాలని ప్లాన్ చేశారట.

ఆ వివరాల్లోకి వెళితే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ నటించే సినిమా త్వరలోనే సెట్స్ పైకి రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పూజ హెగ్డే ని ఇప్పటికే హీరోయిన్ గా ఓకే చేసారు .. ఇక రెండో హీరోయిన్ కోసం అన్వేషిస్తున్న దర్శకుడు షాలిని పాండే ని తీసుకునే ఆలోచనలో ఉన్నాడట. ఈ సినిమాలో ఈ అమ్మడి పాత్ర కీలకంగా ఉంటుందని అందుకే ఈ పాత్రలో షాలిని పాండే ని ఎంపిక చేసారు. దిల్ రాజు, అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ చివరలో షూటింగ్ మొదలు కానుంది.

  •  
  •  
  •  
  •  

Comments