1000 కోట్ల షారూక్‌ ఆస్తులపై ఈడీ విచార‌ణ‌

Thursday, April 19th, 2018, 10:39:16 PM IST

కింగ్‌ఖాన్ షారూక్ బినామీ ఆస్తుల వ్య‌వ‌హారం ప్ర‌స్తుతం ముంబై, దిల్లీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. బాద్‌షాకు చెందిన 1000 కోట్ల విలువ చేసే ఆస్తుల‌పై ఇంటెలిజెన్స్ అధికారుల పంజా ప‌డ‌నుంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఖాన్ కంపెనీల‌కు ఐటీ నోటీసులు జారీ చేశారు. అలీభాగ్ ప్రాప‌ర్టీగా చెబుతున్న 19,960 చ‌ద‌ర‌పు మీట‌ర్ల అగ్రిల్యాండ్స్‌లో పాలాటియ‌ల్ మాన్ష‌న్ పేరుతో అత్యంత ఖ‌రీదైన భ‌వంతిని షారూక్‌ నిర్మించాడు. ఆ ప‌రిస‌రాల్లోనే హెలీప్యాడ్‌, స్విమ్మింగ్ పూల్ వ‌గైరా వ‌గైరా స్వ‌ర్గ సౌఖ్యాల‌కు సంబంధించిన ఏర్పాట్లు చేసుకున్నాడు. వారాంతాల్లో ఇక్క‌డ ఫ్యామిలీ, ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో విహారం.. అతిధుల‌కు పార్టీల‌తో నిత్యం ఆ గెస్ట్ హౌస్ క‌ళ‌క‌ళ‌లాడుతుంద‌న్న‌ది ప్ర‌త్య‌క్ష‌సాక్ష్యుల క‌థ‌నం. ఆ క్ర‌మంలోనే అస‌లు ఈ ఆస్తుల వెన‌క ఉన్న అస‌లు క‌థ‌ను ఐటీశాఖ త‌వ్వితీసింది.

ఈ ఖ‌రీదైన ప్రాప‌ర్టీకి సంబంధించి షారూక్ స‌రిగా ప‌న్నులు చెల్లించ‌లేదని ఐటీ శాఖ ప్రాథ‌మికంగా నోటీసులు పంపించింది. అయినా దీనికి షారూక్ నుంచి స‌రైన స్పంద‌న లేద‌ని చెబుతున్నారు. వాస్త‌వానికి ఈ భూమిని షారూక్ వ్య‌వ‌సాయం చేస్తాన‌ని చాలా త‌క్కువ ధ‌ర‌కే `బినామీ` పేర్ల‌తో ఛేజిక్కించుకున్నాడు. వ్య‌వ‌సాయ భూమి పేరుతోనే ప‌న్నులు చెల్లిస్తున్నాడు. బీచ్ ప‌రిస‌రాల్లో ఉన్న ఈ ఆస్తి విలువ ఇప్పుడు పెరిగిన ధ‌ర‌లో భారీగా ఉంద‌ని తెలుస్తోంది. బ‌హిరంగ మార్కెట్లో 1000కోట్లు ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌స్తుతం ఇరు పార్టీల్ని(షారూక్ &ఐటీ అధికారులు) దిల్లీకి పిలిచి ఆస్తి వివాదాన్ని విచారిస్తున్నార‌ని తెలుస్తోంది. ఈ విచార‌ణ నేప‌థ్యంలో.. బినామీ చ‌ట్టం ప‌రిధిలో ఈ ఆస్తిని సీజ్ చేసేందుకు ఆస్కారం ఉంద‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే అలా జ‌ర‌గ‌కూడ‌దంటే షారూక్ కోర్టుల ప‌రిధిలో ప్రూవ్ చేయాలి అస‌లు నిజాలు.

  •  
  •  
  •  
  •  

Comments