కోటి చెక్ రాసిస్తే కాల‌ద‌న్నుకున్నాడు!

Tuesday, May 22nd, 2018, 11:28:57 PM IST

సినిమా ప‌రిశ్ర‌మ‌ను నెగెటివ్ కోణంలో మాత్ర‌మే చూడ‌క‌పోతే.. ఇక్క‌డ ఫ్రెండ్షిప్‌లు ఒక్కోసారి ఆశ్చ‌ర్యానికి గురి చేస్తాయి. ఇక్క‌డ‌ స్నేహాల గురించి ఎంత చెప్పినా త‌క్కువే. అనుకోకుండా క‌లుసుకుని గొప్ప ప్రాణ స్నేహితులు అయిపోతారు. ఒక‌రికోసం ఒక‌రు ప్రాణం పెట్టేసేంత స్నేహం చేస్తారు.

ఆ కోవ‌లోనే అప్ప‌ట్లో క‌రీనా క‌పూర్ త‌న స్నేహితుడైన క‌ర‌ణ్ జోహార్ కోసం ఉచితంగానే ఐటెమ్ నంబ‌ర్‌లో న‌ర్తించింది. స్నేహితుడి కోసం ప్రాణం పెట్టేస్తూ ఖాన్‌లు సైతం ఒక‌రితో ఒక‌రు చేతులు క‌లిపిన సంద‌ర్భాలున్నాయి. తాజాగా బిగ్‌బి అమితాబ్ బ‌చ్చ‌న్ కింగ్ ఖాన్ షారూక్ స్నేహం గురించిన ఓ ఆస‌క్తిక‌ర సంగ‌తి తెలిసిందే. అప్ప‌ట్లో షారూక్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ నిర్మించిన `ప‌హేళి` (2005) చిత్రంలో అమితాబ్ 10 నిమిషాల నిడివి ఉండే అతిధి పాత్ర‌లో న‌టించారు. ఆ పాత్ర షూట్ పూర్త‌వ్వ‌గానే య‌థావిధిగా ఓ నిర్మాత హోదాలో కోటి (10 మిలియ‌న్ రూపాయ‌లు) చెక్‌ను రాసి అమితాబ్‌కి ఇవ్వ‌బోయాడు షారూక్‌. కానీ స్నేహానికి విలువ‌నిచ్చి ఆ చెక్‌ని అమితాబ్ తీసుకోలేదు. ఆ విష‌యాన్ని షారూక్ స్వ‌యంగా ప‌లు ఇంట‌ర్వ్యూల్లోనూ చెప్పారు. ఇటీవ‌లే మ‌రోసారి ఆ విష‌యంపై షారూక్ ప్ర‌స్థావించ‌డం విశేషం.

  •  
  •  
  •  
  •  

Comments