మైగాడ్‌! ఇండ‌స్ట్రీని షేక్ చేస్తున్న మ‌రుగుజ్జు సోగ్గాడు!

Monday, January 1st, 2018, 11:32:40 AM IST

కింగ్ ఖాన్ షారూక్ న‌టించిన `రాయీస్‌` గ‌త ఏడాది ఆశించిన విజ‌యం సాధించ‌లేదు. `జ‌బ్ హ్యారీ మెట్ సీజెల్‌` సైతం డిజాస్ట‌ర్‌ అయ్యింది. ఆ క్ర‌మంలోనే ఆనంద్ ఎల్‌.రాయ్ ద‌ర్శ‌క‌త్వంలోని చిత్రంపై భారీ ఆశ‌లు పెట్టుకున్నాడు. ఈ సినిమా టైటిల్ తాజాగా రివీల్ చేశారు షారూక్‌. షారూక్ ఈ చిత్రంలో ప్ర‌యోగం చేస్తున్నార‌ని తొలి నుంచి ప్ర‌చారం సాగుతున్నా.. జ‌నాల‌కు మాత్రం పెద్దంత‌గా ఏ అంచ‌నాలు ఏర్ప‌డ‌లేదు.

అయితే నేడు స‌డెన్‌గా షారూక్ అభిమానుల‌కు షాకింగ్ ట్రీట్ ఇచ్చాడు. త‌న మ‌రుగుజ్జు పాత్ర‌ను ఫ‌స్ట్‌లుక్ టీజ‌ర్‌లో రిలీజ్ చేసి షాకిచ్చాడు. ఈ ట్రైల‌ర్ చూడ‌గానే ఫ‌స్ట్ ఇంప్రెష‌న్ ప‌డిపోయింది. మ‌రుగుజ్జు పాత్ర‌లో షారూక్‌ విజువ‌ల్స్ చూశాక అందులోని ఫ‌న్‌కి న‌వ్వుకోకుండా ఉండ‌లేం. వీఎఫ్ఎక్స్‌, గ్రాఫిక్స్ మాయాజాలం అని కొట్టి పారేయ‌లేనంత నేచుర‌ల్‌గా మ‌రుగుజ్జు పాత్ర‌ను ఎలివేట్ చేశారు. ఈ పాత్ర‌ను చూస్తుంటే ఇండ‌స్ట్రీ హిట్ కొట్టేస్తాడేమో అన్నంత‌గా వ‌ర్క‌వుటైంది. అలాగే ఈ సినిమా టైటిల్ `జీరో` అంటూ ప్ర‌క‌టించారు. షారూక్ స‌ర‌స‌న ఈ చిత్రంలో అనుష్క శ‌ర్మ‌, క‌త్రిన కైఫ్ క‌థానాయిక‌లు. 21 డిసెంబ‌ర్ 2018న రిలీజ్ చేయ‌నున్నారు. రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ నుంచి విడుద‌ల‌వుతున్న అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్ర‌మిది. 2018లో ఫ్యాన్స్‌కి షారూక్ అదిరిపోయే ట్రీట్ ఇవ్వ‌బోతున్నాడ‌ని ఈ చిన్న టీజ‌ర్ చెబుతోంది. ఈ సినిమా వీఎఫ్ఎక్స్ కోసం భారీగా ఖ‌ర్చు చేశామ‌ని, అనుకున్న‌ది రాబ‌ట్టుకునేందుకు మ‌నీ హెవీగా ఖ‌ర్చు చేశామ‌ని షారూక్ చెబుతున్నారు. ఈ ప్ర‌య‌త్నం చూస్తుంటే షారూక్ మ‌రోసారి బాక్సాఫీస్ వ‌ద్ద తానే కింగ్ ఖాన్ అని నిరూపించుకుంటాడ‌న్న అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.