వైవిధ్య కథాంశంతో శర్వా, శ్రీకాంత్ అడ్డాల వచ్చేస్తున్నారోచ్..!

Tuesday, May 15th, 2018, 02:59:48 PM IST

సినిమా హిట్టయినా ఫట్టయినా ప్రస్తుత జనరేషన్లో ఫ్యామిలీ ఓరియంటడ్ సినిమాలు తీయాలంటే ముందుండేది శ్రీకాంత్ అడ్డాల అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక కుటుంబంలో ఉండే అనుబంధాలు విలువలూ ఇట్టే వల పోసినట్టుగా చూపించడంలో నిపుణుడనే చెప్పుకోవాలి. కొత్త బంగారు లోకం, ముకుందా, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం, సినిమాలు తీసింది కూడా శ్రీకాంత్ అడ్డాలే. 2016 లో ప్రిన్స్ మహేష్ బాబుతో తీసిన బ్రహ్మోత్సవం తర్వాత శ్రీకాంత్ ఇప్పటివరకు ఒక సినిమా కూడా తీయలేదు.

నిజానికి చెప్పుకోవాలంటే బ్రహ్మోత్సవం బిగ్గెస్టు ఫ్లాపుగా నిలిచిన ఈ డైరెక్టర్ కి కాస్త నిరాశే మిగిల్చిందని చెప్పాలి. అందికే ఈ సారి కొడితే పెద్ద హిట్టే కొట్టాలన్న కసితో రెండేళ్ళ సుధీర్గ విరామం తీస్కున్న తర్వాత మరో కొత్త స్క్రిప్టుతో అభిమానుల ముందుకు వచ్చాడు శ్రీకాంత్ అడ్డాల. అయితే తానూ రెండేళ్లుగా కష్టపడి రాసుకున్న ఈ కొత్త కథలో హీరో శర్వానంద్ ను ఎంపిక చేస్కోగా ఇటివలే అతనికి కథ వినిపించగా శర్వా పచ్చ జెండా ఊపేసాడట.

ఇప్పుడు రెడీ చేసుకున్న స్క్రిప్టు కూడా ఇంచుమించు పూర్తి ఫ్యామిలీ కథానికానికి సంబందించేవిదంగా ఉంటుందని. ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉండే ప్రేమానురాగాల అనుసారంగా ఈ సినిమా సాగుతుందని సినీవర్గం నుండి వచ్చిన సమాచారం. భారీ బడ్జెట్ సినిమాలకు పెట్టింది పేరయిన గీతా ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమాను శ్రీకాంత్ నిర్మించాబోతున్నాడట. అయితే అన్నదమ్ముల మధ్య కొనసాగే ఈ సినిమాలో శర్వానంద్ తర్వాత మరో యాక్టర్ ఎవరిని తీస్కుంటారా అన్న విషయం ఇంకా తేలాల్సి ఉంది.

Comments