శర్వానంద్ దూకుడు అదరహో :

Wednesday, January 25th, 2017, 11:25:43 AM IST

sarvanandh
సంక్రాంతి కి ఫ్యామిలీ హీరో అనిపించుకుని వరస హిట్ లు కొడుతున్నాడు హీరో శర్వానంద్. గత సంవత్సరం భారీ సినిమా తో సక్సెస్ అయిన శర్వా ఈ సారి శతమానం భవతి తో ఇంకా పెద్ద హిట్ ని అందుకున్నాడు. ఇప్పటికే 20కోట్ల షేర్ వసూళ్లను దాటేసి 25 కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతున్నాడు. ఈ స్థాయి వసూళ్లతో ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇంకా శతమానం భవతి సంచలనాలు పూర్తికాక ముందే.. అప్పుడే శర్వానంద్ కొత్త సినిమా మొదలుపెట్టేయడం విశేషం. శతమానం షూటింగ్ జరుగుతున్నపుడే రెండు సినిమాలు లైన్ లో పెట్టాడు శర్వా. వీటిలో ఒకటి దర్శకుడు మారుతితో చేయాల్సి ఉంది. కానీ ఈ చిత్రానికి ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాకపోవడంతో.. ఆ తర్వాత అనుకున్న ప్రాజెక్టును ప్రీపోన్ చేసేశాడు శర్వా. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర అసిస్టెంట్.. శర్వా మూవీతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు. రొమాంటిక్ ఎంటర్టెయినర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో లావణ్యా త్రిపాఠిని హీరోయిన్ గా ఫైనలైజ్ చేయగా.. ఇప్పుడీ మూవీ షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది.