బాలీవుడ్ లోకి శర్వానంద్ సినిమా ?

Monday, February 20th, 2017, 10:38:19 PM IST


ఓక బాషలో హిట్ అయిన సినిమాలు మరో భాషలో రీమేక్ అవ్వడమో లేక డబ్బింగ్ చేయడమో జరుగుతున్న విషయమే. ముక్యంగా ఈ మధ్య కాలంలో టాలీవుడ్ చిత్రాలకు బాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది. మంచి తెలుగు సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తుంటారు బాలీవుడ్ సినిమా వాళ్లు !! ఇక లేటెస్ట్ గా హీరో శర్వానంద్ హీరోగా నటించిన ప్రస్థానం చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేయాలనీ ప్లాన్ చేసారు. దేవా కట్టా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అవార్డులు అందుకుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ హీరోగా ఉంటుందని, పైగా ఈ చిత్రానికి దేవా కట్ట దర్శకత్వం వహిస్తాడట !! ఇప్పటికే దానికి సంబందించిన సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం. సో త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన వివరాలు వెల్లడి కానున్నాయి.