కళ్ళు చెదిరే వసూళ్లతో దూసుకెళ్తున్న శతమానం భవతి

Tuesday, January 31st, 2017, 12:28:23 PM IST

sathamaanambhavathi
ఎంత చిన్నగా మొదలు పెట్టినా ఈ సినిమా అద్భుత విజయం సాధించి సంక్రాంతి బరిలో బాలయ్య- చిరు సినిమాలనే దాటేసింది. పెట్టిన బడ్జెట్ వచ్చిన కలక్షన్ ల పరంగా చూసుకుంటే శతమానం భవతి సూపర్ హిట్ అంచనాలు అందుకుంది. ఈ సంక్రాంతికి తెలుగు ప్రేక్షకుల దృష్టంతా ‘ఖైదీ నెంబర్ 150’.. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ల మీదే నిలిచింది. చర్చంతా చిరు-బాలయ్యల పోటీ మీదే నడిచింది. ‘శతమానం భవతి’ అసలు సోదిలోనే లేదు. ఈ సినిమా రిలీజైనప్పటికి కూడా అది పెద్దగా చర్చనీయాంశం కాలేదు. సంక్రాంతి వీకెండ్ అంతే చిరు.. బాలయ్యల సినిమాల గురించే అంతా చర్చించుకున్నారు. ఆ రెండు సినిమాలకు అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి. ‘శతమానం భవతి’కి కూడా మంచి ఓపెనింగ్సే వచ్చినప్పటికీ.. అవేమీ కళ్లు చెదిరిపోయేవి కావు. బాలయ్య చిరు లో ఓపెనింగ్స్ అదరహో అన్నట్టు రాబట్టారు ఆ తరవాత మూడవ వారం నుంచీ వసూళ్లు నత్త నడకన సాగుతున్నాయి. కానీ శతమానం భవతి మాత్రమ ఓపెనింగ్స్ యావేరేజ్ గా ఉన్నా లాంగ్ రన్ లో మూడు వారాల తరవాత కూడా సూపర్ గా డబ్బులు సాధిస్తోంది