ఆమెకు నా జీవితంలో ప్రత్యేక స్థానం వుంది : నటుడు విశాల్

Monday, May 14th, 2018, 04:29:44 PM IST

యువ నటుడు విశాల్ ప్రస్తుతం ఓ వైపు సినిమాలు చేస్తూ మరోవైపు నడిగర్ సంఘం కార్యదర్శిగా, అలానే నిర్మాతల మండలి అధ్యక్షుడుగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నిజజీవితంలో ఎవరికైన అన్యాయం జరిగితే వెంటనే తనవంతుగా న్యాయం చేసి వారికి సాయపదడంలో ముందుండే వ్యక్తి విశాల్. కాగా ప్రస్తుతం ఆయన తన సొంత బ్యానర్ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ లో చిత్రాలు కూడా నిర్మిస్తున్నారు. అయితే విశాల్ గత కొద్దిరోజులుగా నటుడు శరత్ కుమార్తె వరలక్ష్మి తో ఎంతో సన్నిహితంగా మెలుగుతున్నారని, వీరిద్దరిమద్య ప్రేమాయణం నడుస్తోందని కొన్నాళ్ళనుండి కోలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

కాగా ఇటీవల మిస్టర్ చంద్రమౌళి అనే చిత్ర ఆడియో విడుదల కార్యక్రమానికి విచ్చేసిన వీరిద్దరూ ఒకరినొకరు చాలాసేపు మాట్లాడుకోవడం మీడియా కంట పడింది. కాగా కొద్దిరోజుల క్రితం ఒక తమిళ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో విశాల్ మాట్లాడుతూ మన జీవితంలో స్నేహితులకు ముఖ్యమైన ప్రాధాన్యం ఉంటుందని, తాను ఎంతో గొప్పగా చెప్పుకునే స్నేహితుల బృందం తనకు ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను అన్నారు. అంతేకాదు వారిలో ముఖ్యంగా వరలక్ష్మి తనకు మరింత ప్రత్యేక స్నేహితురాలని, ఎవరైతే మనలోని లోపాలను గుర్తించి, మనకు తెలియచేసి, వాటిని మనం సరిచేసుకునేలా చేస్తారో అటువంటివారే నిజమైన స్నేహితులని, వరలక్ష్మి అటువంటి వ్యక్తి అన్నారు.

తాను నాకు ఎనిమిది సంవత్సరాలుగా పరిచయం, మంచి వ్యక్తిత్వం, భావజాలం కల వ్యక్తి వరలక్ష్మి, అటువంటి ఆమె రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది అనేది ఆమెకు తానిచ్చే సలహా అన్నారు. కొసమెరుపేమిటంటే కోలీవుడ్ మీడియాలో, పత్రికల్లో, వీరిద్దరి ప్రేమపై పలు కథనాలు వెలువడుతున్నప్పటికీ ఇద్దరిలో ఏ ఒక్కరు కూడా వాటిని ఖండించకపోవడం….