సినిమా సూపర్ హిట్ అనే విషయం ఆవిడే నాకు చెప్పింది : మహేష్ బాబు

Tuesday, April 24th, 2018, 10:34:13 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వం లో నటించిన నూతన చిత్రం భరత్ అనే నేను. విడుదలైన మొదటి షో నుండే అన్ని చోట్ల సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయ్యే డిషెగా కలెక్షన్ల దుమ్ము రేపుతోంది. ఇప్పటికే ఓవర్సీస్ లో 2.5 మిలియన్లను కొల్లగొట్టిన ఈ చిత్రం ఫుల్ రన్ లో ఇంకెంత రాబడుతుందో చూడాలి. అలానే రెండు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కేరళ సహా అన్ని చోట్ల అదిరిపోయే కలెక్షన్లు వస్తున్నాయి. బ్రహ్మోత్సవం, స్పైడర్ తో డీలా పడ్డ మహేష్ బాబు కు ఇది మంచి బూస్టప్ ఇచ్చిందనే చెప్పాలి.

ఈ చిత్రం ఘనవిజయం సాధించిన సందర్భంగా చిత్ర యూనిట్ నిన్న భరత్ సక్సె స్ మీట్ హైదరాబాద్ లో నిర్వహించింది. అందులో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుతూ, చిత్రం విడుదల రోజు నైట్ చాలా సేపు నిద్ర పట్టలేదని అన్నారు. అయితే అర్ధరాత్రి 2.30 సమయంలో ఒక్కసారిగా ఆయన భార్య నమ్రత నిద్రలేపి, ఇప్పుడే యూఎస్ఏ లో షో పూర్తి అయింది, అక్కడ సూపర్ హిట్ టాక్ వచ్చింది అని చెప్పగానే ఆయన ఉబ్బితబ్బిబ్బయినట్లు చెప్పారు. చాలారోజుల నుండి ఫాన్స్ కి సరైన విజయం అందించలేకపోతున్న అని,

ఇదివరకు కూడా నా కెరీర్ ఇలాంటి పరిస్థితుల్లో వున్నపుడు కొరటాల శివ గారు అప్ప్పుడు శ్రీమంతుడు ఇచ్చారు. మళ్ళి అదే సందర్భంలో ఇప్పుడు నాకు భరత్ అనే నేను ఇచ్చారు. ఆయన ఋణం ఎప్పటికి తీర్చుకోలేనిది. ఆయనతో కలిసి నేను ఇకపై చేసే ప్రతి చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు మహేష్ బాబు తెలిపారు…..

  •  
  •  
  •  
  •  

Comments