కిలాడీ న‌న్ను వాడుకుని విసిరేసాడు!

Saturday, June 9th, 2018, 02:28:24 AM IST

కిలాడీ అక్ష‌య్ కుమార్ ట్వింకిల్ ఖ‌న్నాని పెళ్లాడి ఇద్ద‌రు బిడ్డ‌ల‌కు తండ్రి అయిన సంగ‌తి తెలిసిందే. అక్ష‌య్ కెరీర్ ఆరంభం ప‌లువురు క‌థానాయిక‌ల‌తో ప్రేమాయ‌ణం సాగించ‌డంపై బాలీవుడ్‌లో వాడి వేడిగా చ‌ర్చ సాగింది. అత‌డు కెరీర్ పీక్స్‌లో ఉండ‌గానే `ద‌డ్క‌న్` అనే చిత్రంలో న‌టించాడు. ఆ సినిమాలో శిల్పా శెట్టి క‌థానాయిక‌. ఆ సమ‌యంలో శిల్పా- అక్ష‌య్ ఒక‌రినొక‌రు ప్రేమించుకున్నారు. ఇక అక్కీ త‌న‌ను పెళ్లి చేసుకుంటాడ‌ని శిల్పా భావించింది. కానీ అక్కీ తెలివిగా శిల్పాకి చెక్ పెట్టాడు.

ట్వింకిల్ ఖన్నాతో ల‌వ్‌లో ప‌డి త‌న‌ని పెళ్లాడేశాడు. ఆ క్ర‌మంలోనే శిల్పా శెట్టి అత‌డి నుంచి దూరమైంది. వాస్త‌వానికి ద‌డ్క‌న్ షూటింగ్ మ‌ధ్య‌లో ఉండ‌గానే ఈ బ్రేక‌ప్ అయ్యింది. తాను ఏమాత్రం ఇబ్బంది పెట్ట‌ద‌లిచినా నిర్మాత‌ల ప‌ని అయిపోయేది. కానీ నా నిర్మాత‌ల్ని ఇబ్బంది పెట్ట‌డం ఇష్టం లేకే అక్ష‌య్‌తో క‌లిసి సినిమా పూర్త‌య్యే వ‌ర‌కూ న‌టించాల్సి వ‌చ్చింది. మ‌న‌సు క‌కావిక‌లం అయిపోయినా.. క‌మిట్‌మెంట్ కోసం ఆ సినిమా పూర్తి చేశానే కానీ, నాలో నేను లేను. అక్ష‌య్ న‌న్ను వాడుకుని విసిరేశాడు. ప్రేమ అంటే త్యాగం. అందుకే అత‌డిపై ప్రేమ‌తో ఏమీ చేయ‌కుండా వ‌దిలేశాను.. అని శిల్పా శెట్టి ఓ టీవీ చానెల్ లైవ్‌ ఇంట‌ర్వ్యూలో వ్యాఖ్యానించ‌డం సంచ‌ల‌న‌మైంది. శిల్పా శెట్టి ప్ర‌స్తుతం బాంబో డైయింగ్ వ‌స్త్ర వ్యాపారి రాజ్‌కుంద్రాని పెళ్లాడి ఓ మ‌గ‌బిడ్డ‌డికి జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments