బిగ్ బాస్ భామల మధ్య తిట్లపురాణం..!

Wednesday, January 17th, 2018, 10:02:30 PM IST

బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ 11 ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. కాగా ఈ షోలో విజేతగా నిలిచినా శిల్పా షిండే, రన్నరప్ గా నిలిచిన ఖాన్ మధ్య బిగ్ బాస్ హౌస్ లో ఇతరహాలో మాటల యుద్ధం జరిగిందో బయట కూడా అదే యుద్ధం కొనసాగుతోంది. బిగ్ బాస్ హౌస్ లో టిఆర్పి రేటింగ్ కోసం ఈ భామలు అలా ప్రవర్తించారని అంతా అనుకున్నారు. కానీ షో ముగిసి బయటకు వచ్చాక కూడా అదే తరహాలో ఒకరిపై ఒకరు తిట్ల పురాణం కొనసాగిస్తున్నారు.

శిల్పా షిండే మాట్లాడుతూ హీనా ఖాన్ కు చాలా పొగరు అని వ్యాఖ్యానించింది. హీనా చాలా మంచి అమ్మాయి అనుకున్నా. కానీ నేను ధరించిన బట్టలపై కూడా ఆమె కామెంట్ చేసింది. హీనా కూడా అదే స్థాయిలో శిల్పా పై కౌంటర్ లు వేసింది. షో విజేతగా నేనే నిలుస్తానని భావించా. కానీ శిల్పా హౌస్ లోపల ఏం చేసిందో, ఎలాంటి పథకం వేసిందో అంటూ పరోక్షంగా వ్యాఖ్యానించింది. షో ముగిశాక కూడా వీరి రచ్చ ఏంటని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.