సారీ చెప్పిన అద్వానీ – మోడీకి శివసేన స్వాగతం

Sunday, June 9th, 2013, 07:46:53 PM IST


బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ పెదవి విప్పారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరుకాకపోవడంపై అద్వానీ వివరణ ఇచ్చారు. గోవాలో ఆదివారం సాయంత్రం ముగిసిన సమావేశంలో ఆయన వీడియో కాన్పరెన్స్ ద్వారా ప్రసంగించారు. సమావేశాలకు హాజరుకాలేకపోయినందుకు క్షమించాలని పార్టీ నేతలను కోరారు. అనారోగ్యం కారణంగానే రాలేకపోయానని చెప్పారు. జాతీయ సమావేశాలకు తాను హాజరుకాకపోవడం ఇదే తొలిసారి అని అద్వానీ విచారం వ్యక్తం చేశారు.

మోడీ నియామకానికి శివసేన స్వాగతం
బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ గా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని ఎంపిక చేయడాన్ని శివసేన స్వాగతించింది. చైర్మన్ గా ఎంపికైన మోడీని శివసేన అభినందించింది. విదేశీ పర్యటనలో ఉన్న శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాకరే.. మోడీకి ఫోన్ చేసి అభినందనలు తెలిపారని పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ రావత్ తెలిపారు.