డిఎస్పీ నా ఆశలపై నీళ్లు జల్లారు.. శివనాగులు ఆవేదన!

Tuesday, April 3rd, 2018, 01:50:53 PM IST

టాలీవుడ్ లో ప్రస్తుతం రంగస్థలం సినిమా మంచి కలెక్షన్స్ తో దుసుకుపోతోంది. ఇప్పటికే 100 కోట్లను క్రాస్ చేసినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న రంగస్థలంపై ఇప్పుడు ప్రముఖులు కూడా ప్రశంసలను అందిస్తున్నారు. చరణ్ నటన సుకుమార్ దర్శకత్వంతో పాటు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా చాలా క్లిక్ అయ్యింది. అయితే అందులో ‘ఆ గట్టునుంటావా… ఈ గట్టుకొస్తావా’ అనే పాట కూడా మంచి హిట్ అయ్యింది. తెలంగాణ జానపద గాయకుడు శివ నాగులు ఆ పాట పాడిన సంగతి తెలిసిందే.

అయితే సినిమాలో అతను పాడిన పాట లేకుండా దేవి శ్రీ గాత్రం వినిపించడం అందరిని షాక్ గురి చేసింది. దేవి శ్రీ ఇలా ఎందుకు చేశారని సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి. ఇక శివ నాగులు కూడా ఈ విషయంపై తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడు. కనీసం ఒక్క మాట కూడా తనతో చెప్పకుండా ఇలా సడన్ గా వాయిస్ మార్చడం చాలా బాధగా అనిపించిందని శివ నాగులు మీడియాకు తెలిపాడు. అలాగే ఆడియో వేడుకలో తనను ఎంతగానో ప్రశంసించిన దేవి శ్రీ ప్రసాద్ గారు -పది రోజుల్లోనే తన ఆశలపై నీళ్లు జల్లారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి ఎవరికీ ఎదురవ్వకూడదు అనే ఆలోచనతోనే మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని శివ నాగులు తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments