జోరుమీదున్న రాజశేఖర్ కూతురు.. పోటీ తప్పేలా లేదు!

Tuesday, July 24th, 2018, 11:33:06 AM IST

సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివాని ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న సంగతి తెలిసిందే. హిందీలో బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచిన 2 స్టేట్స్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఆ సినిమాలో కథానాయికగా నటిస్తోన్న శివాని మొదటి సినిమా విడుదల కాకముందే మరో మంచి ఆఫర్ ను అందుకుంది. కోలీవుడ్ లో యువహీరో విష్ణు విశాల్ కు జోడిగా నటించడానికి ఒప్పుకుంది.

వీవీ స్టూడియోస్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమా, ప్రస్తుతం ‘మదురై’లో షూటింగ్ జరుపుకుంటోంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సాగబోయే ఆ సినిమాను వీవీ స్టూడియోస్ వారు నిర్మిస్తుండగా వెంకటేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక తెలుగు తమిళ్ తో పాటు శివాని మలయాళం సినిమాను కూడా ఇటీవల ఒప్పుకుంది. సీనియర్ నటుడు మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ కథానాయకుడిగా చేస్తోన్న సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు శివాని ఒప్పుకున్నారు. ఒకేసారి మూడు భాషల్లో సౌత్ లో సినిమాలు చేస్తూ శివాని బిజీ అవుతోంది అంటే భవిష్యత్తులో స్టార్ హీరోయిన్స్ కి గట్టిపోటీనే ఇస్తుందని చెప్పవచ్చు.

  •  
  •  
  •  
  •  

Comments