బాడీ గార్డ్ చెంప చెళ్లుమనిపించాడు..ఈ సీఎంకు ఏమైంది..!

Tuesday, January 16th, 2018, 11:17:16 PM IST

ఏం జరిగినా కూల్ గా కనిపించే మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఏమైంది ! దేశమంతా ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. శివరాజ్ సింగ్ చౌహాన్ తనకు భద్రత కల్పిస్తున్న బాడీ గార్డ్ పై చేయి చేసుకున్నారు. దీనితో ముఖ్యమంత్రి పై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్ర్రెస్ పార్టీ శివరాజ్ సింగ్ చౌహాన్ తీరుని ఏకి పారేస్తోంది.

మధ్య ప్రదేశ్ లో ఈ నెలాఖరున మున్సిపల్ ఎన్నికల జరగబోతున్నాయి. ఈ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. కాగా తన పక్కనే ఉన్నా బాడీ గార్డ్ మోచేయి తనకు తగులుతుండడంతో సీఎం అసహనానికి గురయ్యారని అక్కడున్నవారు చెప్పిన మాట. బిజెపికి ఓటమి భయం పట్టుకోవడం వల్లే శివరాజ్ సింగ్ చౌహాన్ ఇలా ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండి పడుతున్నారు. పబ్లిక్ సర్వెంట్ పై చేయి చేసుకున్న ముఖ్యమంత్రి పై కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.