శోభా చౌహాన్ సంచలనం… “బాల్య వివాహాలకు అనుమతిస్తాం”…

Sunday, December 2nd, 2018, 08:32:32 PM IST

అభ్యర్ధులకి ఎన్నికలలో గెలవాలన్న తపన చాలానే ఉంటుంది కానీ, ఎన్నికలలో గెలవాలి అనే ఆశ తో వారు ఎం మాట్లాడుతున్నారో, ఎం హామీలిస్తున్నారో, ఎం చేస్తున్నారో అర్థం కావడం లేదు. గెలుపు మాత్రమే లక్ష్యంతో రాజకీయ పార్టీలు కనీస విచక్షణను మరుస్తున్నాయి. అంతే కాకుండా కొంతమందైతే నెరవేరని హామీలిస్తున్నారు. ఆ హామీలతో ప్రజలని తికమక పెడుతున్నారు. అలంటి సంఘటన రాజస్థాన్ లో జరిగింది. బీజేపీ అభ్యర్థి ఓ అడుగు ముందుకేసి ఈ ఎన్నికలలో మేము గెలిస్తే మాత్రం బాల్య వివాహాలకు అనుమతిస్తాం అని తెలిపింది. ఇప్పుడు ఈ హామీ చాలా వివాదాలకు తేరా లేపింది.

రాజస్థాన్ లోని సోజత్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగిన బీజేపీ మహిళా అభ్యర్థి శోభా చౌహాన్, ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, రాజస్థాన్‌లో బీజేపీని గెలిపిస్తే బాల్య వివాహాల్లో పోలీసుల జోక్యం లేకుండా చేస్తామని, అసలు మీకు బాల్య వివాహాల విషయాల్లో ఎలాంటి సమస్య రానివ్వనని హామీ ఇచ్చేసింది. ఇప్పుడు ఈ వార్త కాస్త వైరల్ గ మారింది. శోభా చౌహాన్ చేసిన ఈ వివాదస్పద హామీపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. మన సమ సమాజంలో బాల్య వివాహాలను ఆపించాల్సిన బాధ్యత ఉన్న నాయకులే వాటిని ప్రోత్సహిస్తామనడం నిజంగా సిగ్గు చేటని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఇలాంటి నాయకులను గెలిపించుకొని మనం ఎం సాధిస్తాం అంటూ ఎద్దేవా చేస్తున్నారు ఇతరనేతలు.