రాజమౌళిపై వస్తున్న రూమర్లకు ఘాటుగా స్పందించిన ‘బాహుబలి’ నిర్మాత !

Wednesday, June 6th, 2018, 04:58:36 PM IST

స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళికి తన ‘బాహుబలి’ చిత్రాన్ని ఎక్కువ భాగం హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం వేసిన భారీ సెట్టింగ్స్ చాలా కాలం పాటు షూటింగ్ నిమిత్తం ఫిల్మ్ సిటీలోనే ఉన్నాయి. ఫిల్మ్ సిటీ అధినేత రామోజీరావుగారు కూడ సినిమాకు అన్ని విధాలా సహకరించారు.

కానీ ఇప్పుడు వీరిద్దరి మధ్యన కొన్ని ఆర్థికపరమైన విభేదాలు తలెత్తాయంటూ కొన్ని మీడియా వర్గాలు వార్తలు మొదలుపెట్టాయి. వాటిపై రాజమౌళి స్పందించకపోయినా చిత్ర నిర్మాతల్లో ఒకరైన, సినిమా నిర్మాణాన్ని, ఇతర వ్యవహారాల్ని అత్యంత దగ్గర నుండి చూసిన శోభు యార్లగడ్డ మాత్రం ఘాటుగా స్పందించారు. కేవలం వ్యూస్ కోసం ఇలా ఒకరిపై తప్పు ప్రచారాలు చేయడం మంచింది కాదని. మరీ ఇంతగా దిగజార వద్దని అన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments