షాక్ .. సినీనటి ఖుష్బూ పై కోడిగుడ్లతో దాడి ?

Thursday, March 1st, 2018, 03:34:19 PM IST

మాజీ హీరోయిన్,నటి , రాజకీయ నాయకురాలు ఖుష్బూ ఊహించని పరాభవాన్ని ఎదుర్కొంది. ఆమె ప్రయాణిస్తున్న కార్ పై నిరసన కారులు ఒక్కసారిగా కోడిగుడ్లు .. టమోటాలతో దాడి చేసారు. ఉన్నట్టుండి ఖుష్బూ పై దాడి చేయడం ఏమిటా అని అనుకుంటున్నారా ? ఆ వివరాల్లోకి వెళితే . 2015లో ఖుష్బూ మహిళల మానం పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం పై కోర్టులో పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసు విచారణ నిమిత్తం తమిళనాడు లోని మేటోర్ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆమెపై కోడిగుడ్ల తో దాడి జరిపారు. ఈ కేసు విచారణ అనంతరం కేసుకును మార్చ్ 6 కు వాయిదా వేశారు.