వావ్ .. చిరు ఫిల్టర్ కాఫీ వచ్చేసింది .. ఇక లాగించడమే !!

Saturday, December 2nd, 2017, 02:40:42 PM IST

సినిమా అభిమానులకు .. ముఖ్యంగా మెగా ఫాన్స్ కు ఇది నిజంగా ఆనందం కలిగించే న్యూస్ .. ఎందుకంటారా .. టాలీవుడ్ లో మెగాస్టార్ గా తిరుగులేని ఇమేజ్ తెచ్చుకున్న చిరంజీవి పేరుతో ఓ ఫిల్టర్ కాఫీ సిద్ధం అయింది. ఇంకెందుకు ఆలస్యం .. మెగాస్టార్ ఫిల్టర్ కాఫీ లాగించేద్దామా అని అనిపిస్తుందా ..? ఎక్కడ దొరుకుతుంది అని షాక్ అవ్వకండి .. అసలు వివరాల్లోకి వెళితే .. మెగా కోడలు ఉపాసన ఈ కాఫీ ని ఏర్పాటు చేసింది. అపోలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కాఫీ షాప్ లో చిరంజీవి ఫిల్టర్ కాఫీ స్పెషల్. ప్రస్తుతం బంజారా హిల్స్ లో ఈ కాఫీ షాప్ ని ఏర్పాటు చేసారు. థియేటర్ కాఫీ పేరుతొ ఏర్పాటైన ఈ కాఫీ షాప్ లో మెగాస్టార్ ఫిల్టర్ కాఫీ దొరుకుతుంది .. రేట్ కూడా ఎక్కువేం కాదు .. కేవలం 20 రూపాయలు మాత్రమే .. ఇంకెందుకు ఆలస్యం .. వెంటనే చిరు కాఫీ లాగించండి.

  •  
  •  
  •  
  •  

Comments