నందమూరి అభిమానులకు షాక్.. టీజర్ రావడం లేదు ?

Tuesday, January 16th, 2018, 12:30:50 PM IST

అన్న నందమూరి ఎన్టీఆర్ రామారావు బయోపిక్ త్వరలోనే సెట్స్ పైకి రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అయన తనయుడు నందమూరి బాలకృష్ణ నటిస్తాడు. అయితే ఎన్టీఆర్ వర్థంతి రోజున అంటే జనవరి 18న ఈ సినిమా టీజర్ ని విడుదల చేయాలనీ ముందు ప్లాం చేసారు. దాంతో నందమూరి ఫాన్స్ తెగ ఖుషి అయ్యారు .. కానీ ఇంకా రెండు రోజుల్లో టీజర్ వస్తుందన్న ఆనందానికి షాక్ ఇచ్చాడుబాలయ్య. ఎందుకంటే ఈ సినిమా టీజర్ జనవరి 18న రావడం లేదని చెప్పేసాడు. మరో డేట్ ప్రకటిస్తారాట. ఎందుకంటే ఈ టీజర్ కోసం కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాలని అనుకున్నారు .. కానీ అది కుదరకపోవడంతో మరో డేట్ న విడుదల చేస్తారట. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలు ఎక్కనుంది.