షాక్ .. సూపర్ స్టార్ కాలా రిలీజ్ డేట్ మారిందా ?

Wednesday, March 21st, 2018, 10:32:17 PM IST


సూపర్ స్టార్ రజని కాంత్ హీరోగా నటిస్తున్న కాలా సినిమా విషయంలో పలు ఆసక్తి కార విషయాలు సంచలనం రేపుతున్నాయి. నిజానికి కాలా సినిమా ఏప్రిల్ 27న విడుదల అవుతుందంటూ వార్తలు వస్తున్నా విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలపై తాజాగా లైకా ప్రొడక్షన్ స్పందించించి. రజని కాంత్ నటిస్తున్న కాలా సినిమా విడుదల డేట్ అధికారికంగా ప్రకటించలేదని చెప్పడంతో అందరు షాక్ అవుతున్నారు. ఇప్పటికే కాలా సినిమా విడుదల డేట్ చూసుకుని మిగతా పెద్ద సినిమాల విడుదల డేట్స్ మార్చుకున్నారు. కానీ ఇప్పుడు కాలా విడుదల డేట్ విషయంలో సందిగ్ధం ఏర్పాడేట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ వ్యవహారం చూస్తుంటే కాలా అనుకున్న సమయానికి రాకపోవచ్చని కోలీవుడ్ లో గుసగుసలు ఎక్కువయ్యాయి.