షాక్…డ్యూయెల్ రోల్ లో మెగాస్టార్ ?

Monday, June 4th, 2018, 10:59:22 PM IST


ప్రస్తుతం సైరా షూటింగ్ లో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ సినిమా కోసం డ్యూయెల్ రోల్ చేసేందుకు రెడీ అయ్యాడు. దాదాపు ఎనిమిదేళ్ల గ్యాప్ తరువాత రీ ఎంట్రీ ఇస్తూ చేసిన ఖైదీ నంబర్ 150 లో కూడా డ్యూయెల్ రోల్ తో రీ ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్న మెగాస్టార్ మరోసారి రెండు పాత్రల్లో కనిపిస్తాడట. కొరటాల శివ దర్శకత్వంలో నటించేందుకు మెగాస్టార్ ఓకే చెప్పిన విషయం తెలిసిందే. త్వరలోనే మొదలు కానున్న ఈ సినిమాలో రెండు పాత్రల్లో మెగాస్టార్ కనిపిస్తాడని టాక్. అందులో ఒకటి మారుమూల గ్రామంలోని రైతుగా కనిపిస్తే .. మరో పాత్ర బిలియనీర్ అయినా ఎన్నారై గా ఉంటుందనే విషయం ఫిలిం వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ విషయంలో బిజిగా ఉన్న కొరటాల శివ వీలైనంత త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తెచ్చే ఆలోచనలో ఉన్నాడట. సో త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. భరత్ అనే నేను వంటి హిట్ తరువాత కొరటాల మెగాస్టార్ తో సినిమా చేయడం హాట్ టాపిక్ గా మారింది.

  •  
  •  
  •  
  •  

Comments