ఆ క్రేజీ మల్టిస్టారర్ కు డేట్ ఫిక్స్ అయినట్టే ?

Tuesday, June 19th, 2018, 11:51:50 AM IST

టాలీవుడ్ లో అత్యంత భారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కే క్రేజీ మల్టి స్టారర్ కోసం అటు ప్రేక్షకులు, ఇటు సినీ జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. బాహుబలి తరువాత జక్కన్న తెరకెక్కించే మల్టి స్టారర్ లో ఎన్టీఆర్ – రామ్ చరణ్ నటిస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా సెట్స్ పైకి సమయం ఆసన్నమైంది. ఈ సినిమాను నవంబర్ లో పూజ కార్యక్రమాలతో మొదలు పెడతారట. ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉండగా .. రామ్ చరణ్ దర్శకుడు బోయపాటి శ్రీను సినిమాతో బిజీగా ఉన్నారు. సెప్టెంబర్ వరకు ఇద్దరు హీరోలు ఫ్రీ అవుతారు కాబట్టి నవంబర్ నుండి రాజమౌళి సినిమాలో పాల్గొంటారు. అయితే ఈ సినిమాను మాత్రం 2020 సంక్రాంతికి విడుదల చేస్తారట. అంటే జక్కన్న చెక్కే ఈ మల్టి స్టారర్ సినిమా చూడాలంటే ఇంకో ఏడాదిన్నర ఎదురు చూడాల్సిందే. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నాడు. త్వరలోనే మరిన్ని వివరాలు ప్రకటిస్తారట !