బిగ్ బాస్ రెండో సీజన్ లో శ్రీ రెడ్డి పాల్గొననుందా?

Friday, June 1st, 2018, 11:10:20 AM IST

తెలుగులో వచ్చిన బిగ్గెస్ట్ రియాలిటీ షో గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ రెండో సీజన్ కు సన్నాహాలు ఊపందుకున్నాయి. గత ఏడాది ప్రసారం అయినా బిగ్ బాస్ మొదటి సీజన్ సూపర్ హిట్ కావడంతో రెండో సీజన్ కు విపరీతమైన క్రేజ్ పెరిగింది. మొదటి భాగానికి ఎన్టీఆర్ హోస్ట్ గా చేసి ఆకట్టుకున్నాడు .. ఇప్పుడు రెండో సీజన్ కోసం నాని రంగంలోకి దిగాడు. జూన్ 10 నుండి దాదాపు 100 రోజుల పాటు జరిగే ఈ సీజన్ లో ఇప్పటికే 16 మంది కంటెస్టెంట్ ని ఎంపిక చేసారు .. వారెవరనే దానిపై క్రేజ్ నెలకొంది.

సెలెబ్రిటీలతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా ఇద్దరు ముగ్గురు ఉంటారని టాక్. అయితే ఈ బిగ్ బాస్ 2 లో మసాలా డోస్ కాస్త ఎక్కువగానే ఉంటుందని చెప్పాడు నాని .. అందులో భాగంగా ఈ రెండో సీజన్ లో సంచలనాల తార శ్రీ రెడ్డి కూడా పాల్గొంటుందన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. కాస్టింగ్ కౌచ్ పై సంచలనం రేపిన శ్రీ రెడ్డి ఈ షో లో పాల్గొన్నదంటే అంతా రచ్చ రచ్చే అని అంటున్నారు జనాలు .. మరి ఈ షో లో శ్రీరేది ఉందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

  •  
  •  
  •  
  •  

Comments