విడిచి వెళ్లిన స్నేహితుడి వెంటే..మిత్రుడి మరణాన్ని తట్టుకోలేక..!

Wednesday, September 28th, 2016, 12:14:34 PM IST

fnd
హైదరాబాద్ కూకట్ పల్లిలో విషాదం చోటు చేసుకుంది.మిత్రుడి మరణాన్ని తట్టుకోలేకపోయిన మరో వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం ఉదయం జరిగింది.హరికృష్ణ, రమేష్ లు ఇద్దరు చిన్ననాటి నుంచి స్నేహితులు.వీళ్ళిద్దరూ గుంటూరు జిల్లా కారంపూడి కి చెందిన వారు. హరికృష్ణ హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్టువేర్ ఉద్యోగి.రమేష్ ఓ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. వీళ్ళిద్దరూ కూకట్ పల్లిలో ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నారు.

వీళ్ళిద్దరూ అమిర్ పేటలోని వారి స్నేహితుడిని కలసి తిరిగి బైక్ పై వస్తున్నారు. ముడపేట వద్ద రోడ్ ప్రమాదం జరగడంతో వెనక కూర్చున్న హరికృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు.తన ప్రాణస్నేహితుడు మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన రమేష్ భరత్ నగర్ లోని రైల్ పట్టాలపై కి చేరుకొని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీస్ లు ఇరువురి మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.దగ్గరలోని సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించిన పోలీస్ లు వెనుకనుంచి వచ్చిన లారీ బైక్ ను ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు గుర్తించారు.లారీడ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments