షాకింగ్ ఫొటో: తొమ్మిది మంది ఫీల్డర్లు అక్కడే

Thursday, October 19th, 2017, 02:55:33 AM IST

క్రికెట్ ఆటలో ఎన్నో అద్భుతాలు చోటు చేసుకుంటాయి. ఒక్కోసారి వాటికి సంబందించిన వీడియోలు ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతాయి. అలాగే రీసెంట్ గా ఒక ఫొటో చాలా వైరల్ అవుతోంది. సాధారణంగా క్రికెట్ ఆటలో స్లిప్ లో నలుగురు లేదా ముగ్గురు నిలబడడం చూస్తుంటాం కానీ ఒక రంజీ ట్రోపి మ్యాచ్ లో ఎవరు ఊహించని విధంగా ఏకంగా ఆటలో ఉన్న ఫీల్డర్లు మొత్తం స్లిప్ లోనే నిలబడ్డారు.

వివరాల్లోకి వెళితే.. రీసెంట్ గా బెంగాల్‌ – ఛత్తీస్‌గఢ్‌ ల మధ్య జరిగిన మ్యాచ్ లో బెంగాల్ ఫీల్డర్లు అందరికి షాక్ ఇచ్చారు. జట్టులో ఉన్న సీనియర్ ఆటగాళ్లు మహమ్మద్‌ షమి, అశోక్‌ దిండా బ్యాట్స్ మెన్ ను తొందరగా అవుట్ చెయ్యాలని తొమ్మిది మంది ఫీల్డర్లను స్లిప్ లో పెట్టారు. ఈ క్రమంలో అశోక్ దిండా అద్భుతమైన బౌలింగ్ తో చత్తిస్ గడ్ జట్టును ఆలౌట్ అయ్యింది. అయితే ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది.