షాకింగ్ – జగన్ ముందు నీ భాష సరి చూసుకో – పవన్ విమర్శలు

Thursday, January 10th, 2019, 09:41:58 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తాజాగా వైస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ ని మరియు ఆయన మాటలను తప్పు పడుతున్నారు. మాట్లాడే ముందు మీ బాషా సరిచూసుకోండి అని పవన్ తెలిపారు. అంతేకాకుండా జగన్‌లా చంపేయండి, చింపేయండని తానెప్పుడూ మాట్లాడలేదు. ‘నేను ఏ విమర్శ చేసినా ఆదర్శవంతమైన భాషనే ఉపయోగించానని’ పవన్ స్పష్టం చేశారు. కడప జిల్లా నేతలతో సమావేశం నిర్వహించిన పవన్ కళ్యాణ్, ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా మార్చేందుకే తానూ జనసేన పార్టీ ని స్థాపించానని, రాష్ట్రంలో సమస్యలు లేకుండా ప్రక్షాళన చేయడమే తన లక్ష్యం అని పవన్ కళ్యాణ్ తెలిపారు. రాజకీయాల్లో ఆధిపత్యం కోసం కాకుండా వ్యవస్థలో మార్పుల కోసం జనసైనికులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

రాష్ట్ర రాజకీయాల్లో యువత ముందుండేలా బాధ్యత తీసుకుంటానని పవన్ తెలిపారు. నేను ప్రజారాజ్యం పార్టీ కంటే ముందే కామన్‌మ్యాన్ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ పెట్టినట్లు తెలిపారు. 2003లోనే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. ఇంతకూ ముందు ఎన్నికల్లో ఏపీ కి ఎదో లాభం జరుగుతుందనే మోడీ కి మద్దతు ఇస్తే తానూ కూడా మోసం చేశారని పవన్ తెలిపారు.