షాక్ .. చక్కనమ్మ .. బాగా చిక్కిందిగా ?

Tuesday, March 13th, 2018, 10:11:09 AM IST

చక్కనమ్మ చిక్కినా అందమే కానీ మరి ఇంతగా చిక్కిపోవడం చూసి షాక్ అవుతున్నారు జనాలు. ఏంటి ఈ ఫొటోలోని భామను చూసి మీరు గుర్తుపట్టడం లేదా ఏమిటి ? బాగా చుడండి .. ఆమె ఎవరో కాదు తెలుగు భామ అంజలి ? ఏంటి అంజలా అని షాక్ అవుతున్నారా ? నిజం .. బొద్దుగా … ముద్దుగా ఉండే ఈ భామ కొన్నాళ్ళు మీడియా కు దూరంగా ఉండి ఇలా ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు .. గీతాంజలి లాంటి సినిమాలతో ఆకట్టుకున్న అంజలి ఆ సినిమాల్లో బొద్దుగానే కనిపించింది. అయితే బొద్దుగా ఉన్న కారణంగా అవకాశాలు పెద్దగా రాలేదు .. ముక్యంగా కుర్ర హీరోల సరసన ఛాన్సులు రాకపోవడంతో వెంటనే స్లిమ్ అవ్వాలని ఫిక్స్ అయింది. అంజలి కృషి ఫలించింది .. తాజాగా ఓ ఆమెను చుసిన వారంతా షాక్ అవుతున్నారు. ఏంటి అంజలి ఇలా మారిపోయింది అని. దాదాపు జీరో సైజ్ లో ఈ అమ్మడు షాక్ ఇచ్చింది. మొత్తానికి అంజలి స్లిమ్ అవతారం తో మళ్ళీ సినిమాల్లో అవకాశాలు పట్టేయడం ఖాయమని అంటున్నారు సినీ జనాలు. ప్రస్తుతం గీతాంజలి సీక్వెల్ లో నటిస్తుంది అంజలి.