షాక్ .. త్వరలోనే అనుష్క పెళ్లట ?

Tuesday, June 12th, 2018, 10:44:16 AM IST

అందాల భామ అనుష్క త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుందన్న న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. అనుష్క పెళ్లి గురించి జాతీయ మీడియా ఓ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. ఈ ఏడాది చివర్లో అనుష్క పెళ్లి జరగనుందని, పెళ్లి కి ముందు అనుష్క పలు ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తు ప్రత్యేక పూజలు చేస్తున్నదని ఆ కథనంలో పేర్కొంది. ఆమె తల్లిదండ్రులు పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నారని, పెళ్లి కొడుకు కోసం ఆమె తల్లిదండ్రులు చాలా మంది ప్రపోజల్స్ చూస్తున్నారని టాక్. అనుష్కకు తగ్గ పెళ్లి కొడుకు దొరకగానే పెళ్లి అవుతుందట.

అనుష్క ప్రస్తుతం తెలుగులో ఓ కుర్ర దర్శకుడి సినిమాలో నటించేందుకు ఓకే చెప్పింది. బాగమతి తరువాత కాస్త సన్నబడేందుకు టైం తీసుకున్న అనుష్క మళ్ళీ వరుసగా సినిమాల్లో బిజీ అయ్యేందుకు రెడీ అయింది. అరుంధతి, బాహుబలి, భాగమతి లాంటి సినిమాలలో నటిగా తనను తానూ ప్రూవ్ చేసుకున్న అనుష్క తో లేడి ఓరియెంటెడ్ సినిమాలు తీయడానికి ఎక్కువ మంది దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారట.

  •  
  •  
  •  
  •  

Comments