షాకింగ్ న్యూస్ : నేను కూడా శ్రీరెడ్డి లానే చేస్తా!

Sunday, April 8th, 2018, 12:31:25 PM IST

ఇటీవల తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వడంలేదని, అలానే ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ల వల్ల అవకాశాల కోసం వచ్చే అమ్మాయిలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇటీవల పలు మీడియా చానెల్స్ లో, అలానే పత్రిక ముఖంగా హీరోయిన్ శ్రీరెడ్డి తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు శేఖర్ కమ్ముల, ఇండియన్ ఐడల్ శ్రీరామ చంద్ర పేర్లను బయటపెట్టిన ఆమె నిన్న ఫిలిం ఛాంబర్ ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేసి తన నిరసన తెలిపారు. అయితే నిన్నటి నుండి ఆ ఘటన పై ఇప్పటివకు టాలీవుడ్ ప్రముఖులు ఎవరు స్పందించక పోవడం గమనార్హం. ఒక అమ్మాయి రోడ్ పైకి వచ్చి తనకు కలిగిన బాధను, ఆవేదనను వ్యక్తపరుస్తుంటే కనీసం ఛాంబర్ కు చెందిన ఒక్కరు కూడా స్పందించకపోవడం సిగ్గుచేటని ఆవిడ మండిపడ్డారు.

అయితే ఇది ఇంతటితో అయిపోలేదని, ఇప్పటివరకు పలువురు పేర్లు చెప్పిన ఆమె, ఇకపై తన వద్ద వున్న ఇతర ప్రముఖుల వీడియోలను బయట పెడతా అంటున్నారు. అయితే ఈ విషయమై అనూహ్యంగా ఒక ట్రాన్సజెండర్ ఆమెకు మద్దతు పలుకుతూ తెలుగు సినిమాల్లో అవకాశం ఇవ్వకుంటే తాను కూడా దుస్తులు విప్పి నగ్న ప్రదర్శన చేస్తానని, అంతే కాక నిప్పుతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంటా అని వీడియో పోస్ట్ చేస్తూ హెచ్చరించింది. ఆమె మెసేజి కి శ్రీరెడ్డి స్పందిస్తూ నువ్వు బాధపడకు ఇద్దరం కలిసి పోరాడదాం, నువ్వు ట్రాన్సజెండర్ వి అయితే ఏంటి అందరిలానే మనిషివేకదా, ఈ మాత్రం దానికి చనిపోవలసిన అవసరం లేదని శ్రీరెడ్డి అన్నారు….

  •  
  •  
  •  
  •  

Comments