200 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన చిట్టిబాబు ?

Wednesday, April 25th, 2018, 09:29:29 PM IST


చిట్టిబాబు అలియాస్ .. రామ్ చరణ్ టాలీవుడ్ లో కొత్త రికార్డ్ కొట్టేసాడు. ఇప్పటి వరకు టాలీవుడ్ లో బాహుబలి తరువాత నమోదైన రికార్డ్స్ లో రంగస్థలం మొదటి స్థానంలో నిలిచింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గత నెల 30న విడుదలై అన్ని కేంద్రాల్లో సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినా ఈ సినిమా ఇప్పటికే 25 రోజులు పూర్తీ చేసుకుని వసూళ్ల పరంగా అన్ని ప్రాంతాల్లో రికార్డులు అందుకుంది. తాజగా ఈ సినిమా 200 కోట్ల క్లబ్ లో చేరడంతో మైత్రి మూవీస్ నిర్మాతలు మంచి జోరుమీదున్న. టాలీవుడ్ లో బాహుబలి తరువాత 200 కోట్ల క్లబ్ లో చేరిన మొదటి సినిమాగా రికార్డు నమోదు చేసింది. 1980 ల నాటి కథతో తెరకెక్కిన ఈ సినిమా కు ఇంకా ఎక్కడ క్రేజ్ తగ్గక పోవడం విశేషం.

  •  
  •  
  •  
  •  

Comments