షాకింగ్ న్యూస్ : ‘రంగస్థలం’ లో సర్ ప్రైజ్ విలన్?

Thursday, March 29th, 2018, 04:30:15 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సమంత హీరోయిన్ గా, డిఫరెంట్ సినిమాలు తీయడంలో దిట్ట అయిన దర్శకత్వం లో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మితమైన సినిమా రంగస్థలం. ఈ సినిమా నేపధ్యం మొత్తం 1985 నాటిది కాబట్టి అప్పటి పరిస్థితులను అద్దంపట్టేలా సినిమాలో సెట్టింగ్ లు రూపకల్పన చేయడం జరిగింది. అలానే సుకుమార్ కూడా ఎక్కడా అప్పటి ఫీల్ ని మిస్ కాకుండా సినిమా తెరకెక్కించారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా కథ మొత్తం రంగస్థలం అనే ఊరిలో జరిగే రాజకీయాల చుట్టూనే తిరుగుతుంటుందని తెలియవస్తోంది. కాగా ఇందులో జగపతిబాబు ఆ ఊరి ప్రెసిండెంట్ గా నటిస్తున్నారు. అయితే అందరూ ఇప్పటివరకు అంటున్నట్లు ఈ సినిమాలో జగపతి బాబు మెయిన్ విలన్ కాదని సమాచారం.

హీరో రాంచరణ్ ఇందులో చిట్టిబాబు పాత్ర చేస్తుండగా, ఆయన అన్న కుమార్ బాబు పాత్రలో ఆది పినిశెట్టి నటిస్తున్నారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం సినిమా మొదటినుండి పాజిటివ్ గా ట్రావెల్ అయ్యే కుమార్ బాబు పాత్ర చివరకు నెగటివ్ షేడ్ కి తిరుగుతుందని అంటున్నారు. అంటే ఈ సినిమాలో ఇద్దరు విలన్లా, లేక ఒకరేనా? అసలు విలన్ జగపతి బాబా, లేక ఆదినా? అనే పలు సందేహాలు వెంటాడుతున్నాయి. నిజానికి ఇప్పుడు మనం అనుకున్నది ఊహాజనితమే, అయినప్పటికీ అసలు ఎవరు విలనో తెలియాలంటే రేపటి సినిమా విడుదల వరకు ఆగాల్సిందే మరి…..