జనసేనాని ఓటమిపై ఇప్పుడు సంచలనం రేపుతున్న కొన్ని అనుమానాలు.!

Thursday, June 6th, 2019, 03:58:03 PM IST

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి పాలవ్వడం జనసేన శ్రేణులకు అస్సలు మింగుడు పడని అంశం.పవన్ మొట్టమొదటి సారి పోటీ చేస్తుండడం అలాగే అన్ని రకాలుగా తాను పోస్టి చేస్తున్న చోట నుంచే దాదాపు 7 నియోజకవర్గాలను సైతం ప్రభావితం చేసేలా వేసుకున్న ప్రణాళికతో జనసేనాని ప్రభంజనం చూపుతారు అనుకుంటే అది పూర్తిగా తలకిందులు అయ్యింది.నిజంగా రెండు చోట్ల కాకపోయినా ఒక్క చోట అయినా సరే భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని జనసేన శ్రేణులు సహా పెద్ద పెద్ద రాజకీయ విశ్లేషకులే అన్నారు.

భీమవరంలో అయితే పవన్ గట్టి పోటీలో ఉంటారని కానీ గాజువాకలో మాత్రం కళ్ళుమూసుకొని వార్ వన్ సైడ్ చేసేస్తారని అనుకున్నారు.కానీ సీన్ కట్ చేస్తే పవన్ రెండు చోట్లా ఓటమి పాలయ్యారు.ఇక్కడే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఏ భీమవరంలో అయితే పవన్ గట్టి పోటీ ఇస్తారో అనుకున్నారో అక్కడ గెలుపు అంచులు వరకు వచ్చారు.కానీ పక్కాగా గెలుపొందుతారు అనుకున్న గాజువాకలో మాత్రం పెద్ద మెజార్టీ తోనే ఓటమి పాలయ్యారు.ఇక్కడే పలు రకాల అనుమానాలు ఇప్పుడు సోషల్ మీడియాలో జనసేన శ్రేణులు రేకెత్తిస్తున్నారు.ఖచ్చితంగా ఈవీఎం మెషిన్లలోనే ఏదో తేడా ఉందని ఒక ఉదాహరణను కూడా సాక్ష్యంగా చూపుతున్నారు.

తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని “జగన్నాథపురం” అనే గ్రామం టీడీపీ కంచుకోటగా పరిగణించబడుతుంది.అక్కడున్న రెండు బూత్ లు 23,24.ఎప్పటిలాగానే టీడీపీకి అత్యధిక మెజారిటీ రావాలి కానీ 23వ బూత్ లో అలాగే వచ్చింది కానీ 24వ బూత్ లో మాత్రం వైసీపీకి మెజారిటీ వచ్చింది! అదెలా ఎలా వచ్చిందో అని ప్రశ్నలు వేస్తున్నారు.ఇప్పుడు ఇదే స్ట్రాటజీని భీమవరం, గాజువాకలో వాడి గెలిచారని అంటున్నారు.మరి అసలు పవన్ ఓటమికి అసలు కారణం ప్రజా తీర్పేనా లేక ఈవీఎం తీర్పా అని మరికొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.