పదినిమిషాలకె…నలభై లక్షలు వసూలు చేసింది?

Tuesday, November 22nd, 2016, 03:53:52 PM IST

avika-gor
చిన్నారి పెళ్లి కూతురిగా ఇమేజ్ తెచ్చుకుని .. ఆ తరువాత మూడు, నాలుగు సినిమాల్లో నటించిన అందాల భామ అవికా గోర్ కు ఇప్పుడు తెలుగులో పెద్దగా చెప్పుకునే సినిమాలు లేవు. అవకాశాలు కూడా పెద్దగా రావడం లేదు. అయితే ఈ అమ్మడు లేటెస్ట్ గా ”ఎక్కడికి పోతావు చిన్నవాడా” సినిమాలో చిన్న గెస్ట్ పాత్ర చేసింది. ఆ పాత్రకు మంచి క్రేజ్ దక్కింది, అయితే ఈమే నటించిన ఆ పదినిమిషాల పాత్ర కోసం .. ఏకంగా 40 లక్షలు వసూలు చేసిందట !! అవికాగోర్ … హీరోయిన్ గా చేస్తే .. ఇంకాస్త ఎక్కువ మొత్తం తీసుకునేది .. కానీ ఈ సినిమాలో పది నిమిషాలకే .. ఇంత వసూలు చేయడం నిజంగా పరిశ్రమలో సంచలనం రేపుతోంది. మరి ఈ సినిమాకోసం అడిగినంత ఆ నిర్మాత ఇవ్వడం కూడా ఆసక్తి రేపుతోంది.