బిగ్ రిపోర్ట్: జగన్ ఐదు నెలల పాలనపై షాకింగ్ రిజల్ట్..!

Sunday, October 20th, 2019, 08:25:04 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుంటే, టీడీపీ మాత్రం ఘోర పరాభవాన్ని చవి చూసింది. అయితే ఈ ఎన్నికలలో ప్రధానంగా మూడు పార్టీలు బరిలో ఉన్నా గెలుపు మాత్రం టీడీపీ, వైసీపీల మధ్యనే కనిపించింది. అయితే ఎన్నికలకు ముందు అందరూ అనుకున్న అంచనాలను, సర్వే ఫలితాలను తలదన్నేలా వైసీపీ ఏకంగా 175 అసెంబ్లీ స్థానాలకుగాను 151 స్థానాలను గెలుచుకుని విజయ దుందుభి మోగించింది. ముఖ్యమంత్రిగా జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ పాలనతో అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు.

అయితే జగన్ అధికారాన్ని చేపట్టి అప్పుడే ఐదు నెలలు గడిచిపోయింది. అయితే జగన్ ఐదు నెలల పాలనపై ఒక ప్రముఖ సర్వే వారు సర్వే నిర్వహించారని, ఆ సర్వే ఫలితాలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్నాయి. అయితే ఆ సర్వేలో దాదాపుగా 70 నుండి 80 శాతం వరకు ప్రజలు జగన్ పాలన బాగుందని, ఆయన పాలనలో కొన్ని సమస్యలు ఉన్నప్పటికి ఒక్కొక్క హామీనీ నెరవేరుస్తూ, ప్రజల సమస్యలను తీర్చడంలో సక్సెస్ అయ్యారని అంటున్నారట. అయితే మిగిలిన 20 శాతం మంది మాత్రం జగన్ గారి పాలన అంతగా సంతృప్తికరంగా లేదని, కాకపోతే ఐదు నెలలలో ఏమీ చెప్పలేమని మరికొద్ది రోజులు గడిస్తే జగన్ ప్రజలకు ఇచ్చిన మాటను ఏ మేరకు నిలుపుకున్నారనేది తెలుస్తుందని అంటున్నారట. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కాస్త సమయం ఇవ్వాలని ఈ ఐదేళ్ళలో జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలన్ని నెరవేర్చగలిగితే తరువాతి ఎన్నికలలో కూడా మరోసారి ప్రజలు భారీ మెజారిటీ కట్టబెడతారని చెబుతున్నారట.