పవన్ – ఎన్టీఆర్ ల కలయిక.. షాకిస్తున్న రూమర్..!

Tuesday, October 24th, 2017, 03:50:03 AM IST

మెగా ఫ్యామిలీ ఈవెంట్స్ కే ఆమడ దూరంలో ఉండే పవన్ కళ్యాణ్.. ఎన్టీఆర్ సినిమా లాంచ్ కు వెళ్లడంతో ఓ వైపు అభిమానులకు సంతోషంగా ఉన్నా మరో వైపు ఆశ్చర్యకగా కూడా ఉంది. పవన్ – ఎన్టీఆర్ ల కలయిక గురించి కొన్ని ప్రచారాలు అప్పుడే వెలుగులోకి కూడా వచ్చేశాయి. సాధారణంగా పవన్ రాకపై అంతటా వినిపించే మాట ఏంటంటే త్రివిక్రమ్ ఆహ్వానం మేరకే వచ్చాడని అంటున్నారు.

హారిక అండ్ హాసిని బ్యానర్ లో త్రివిక్రమ్ రహస్య భాగస్వామి అనే ప్రచారం కూడా ఉంది. అందుకే వరుస పెట్టి ఆ బ్యానర్ లోనే త్రివిక్రమ్ చిత్రాలు వస్తున్నాయి. ఈ మధ్యన పవన్ – త్రివిక్రమ్ లు కలసి బిజినెస్ కూడా మొదలు పెట్టారు. నితిన్ హీరోగా రూపొందుతోన్న కొత్త చిత్రంలో వీళ్లిద్దరూ నిర్మాతలు అనే విషయం తెలిసియందే. కాగా హారిక హాసిని బ్యానర్ లో పవన్ కి కూడా వాటా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. జనసేన పార్టీకి అవసరమైన నిధుల్ని పవన్ కళ్యాణ్ ఈ విధంగా సమకూర్చుకుంటున్నట్లు ఇన్ సైడ్ టాక్.

  •  
  •  
  •  
  •  

Comments