షాక్.. వెబ్ సిరీస్ ల పేరుతో మరి ఇంత పచ్చిగానా ?

Sunday, September 30th, 2018, 10:36:53 AM IST

ఈ మధ్య ఇండియాలో క్రియేటివి పేరుతొ .. మరి దారుణమైన చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. సినిమాలైతే సెన్సార్ ఉంటుంది .. అది పెద్ద సమస్య కాబట్టి .. వెబ్ సిరీస్ లపై పడ్డారు. వెబ్ సిరీస్ లకు ఎలాగూ సెన్సార్ లేదు కాబట్టి మేకర్స్ రెచ్చిపోతూ .. బూతు కె పెద్ద పీట వేస్తున్నారు. ఇప్పడు వస్తున్నా ఏ వెబ్ సిరీస్ చూసినా అందులో సెక్స్ కంటెంట్ కామన్ గా మారింది. నేపథ్యం ఏదైనా సరే .. మసాలా అద్దేస్తూ .. మరి పచ్చిగా సెక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తూ నానా రచ్చ చేస్తున్నారు. అందులో హింస కూడా మితిమీరిపోతుంది. ఆ మధ్య రామ్ గోపాల్ వర్మ సెన్సార్ వాళ్ళు క్రియేటర్స్ ని తొక్కేస్తున్నారంటూ ఘాటుగా కామెంట్ పెట్టాడు. ఈ విషయం పై చాలా రోజుల నుండి విమర్శకుల నుండి విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇక ఈ టాపిక్ అంతా అందుకయ్యా అంటే . తాజాగా హిందీలో వచ్చిన ట్రిపుల్ ఎక్స్ వెబ్ సిరీస్ సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతోంది. బాలీవుడ్ క్రేజీ నిర్మాత ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ఈ ఎక్స్ ఎక్స్ ఎక్స్ సిరీస్ కు సంబందించిన మరో ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ లో పచ్చి సన్నివేశాలు చాలానే చూపించారు. ఈ లెక్కన ఈ సిరీస్ సెక్స్ సినిమాను తలపించేలా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. వెబ్ సిరీస్ ల పేరుతొ పోర్న్ సినిమాలు తీస్తున్నారంటూ ఓ వర్గం రచ్చ చేస్తూనే ఉంది. అసలు ఈ వెబ్ సిరీస్ ల పేరుతొ అనవసరమైన కంటెంట్ కు సెక్స్ , హింస ని జోడించి మరి పోర్న్ సినిమాలుగా మార్చేస్తున్నారు. ఈ సిరీస్ విడుదలైతే ఇంకెంత దుమారం రేగుతుందో చూడాలి.