`సాహో` బిజినెస్‌లో న‌గ్న‌స‌త్యం?

Thursday, April 19th, 2018, 10:04:41 PM IST

ప్ర‌భాస్ న‌టిస్తున్న యాక్ష‌న్ ఎడ్వంచ‌ర్ `సాహో`ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్యంత భారీగా రిలీజ్ చేసేందుకు ప్ర‌ణాళిక‌లు సాగుతున్నాయి. అందుకు త‌గ్గ‌ట్టే ప్రీరిలీజ్ బిజినెస్‌పైనా హైప్ నెల‌కొంది. ఇటీవేల హిందీ హ‌క్కులు టీ-సిరీస్ అధినేత‌లు 120కోట్ల‌కు చేజిక్కించుకున్నార‌న్న‌ ప్ర‌చారం సాగింది. అయితే ఈ ప్ర‌చారంలో ఏమాత్రం నిజం లేదు. డీల్ పూర్త‌యిన మాట వాస్త‌వ‌మే అయినా.. ఈ డీల్ కేవ‌లం 50 కోట్ల మేర ముగిసింద‌ని చెబుతున్నారు. క‌మీష‌న్ బేసిస్‌లో ఇత‌ర పంపిణీ సంస్థ‌ల ద్వారా ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ఒప్పందం సాగిందిట‌.

ఇక తెలుగు, త‌మిళ్ హ‌క్కులు క‌లుపుకుని 125 కోట్లకు.. ప‌లుకుతోంద‌ని తెలుస్తోంది. సాహో సినిమా బ‌డ్జెట్‌పైనా అన‌వ‌స‌రం ప్ర‌చారం సాగుతోంది. దాదాపు 225కోట్లు ఖ‌ర్చు చేస్తున్నార‌నేది అవాస్త‌వం అని, పీఆర్‌వోల హైప్ మాత్ర‌మేన‌ని చెబుతున్నారు. 150కోట్ల బ‌డ్జెట్ సినిమాకి ఈ స్థాయి ప్ర‌చారం చేయ‌డం వెన‌క రీజ‌న్ వేరే ఉంద‌న్న‌ది విశ్లేష‌ణ‌.

  •  
  •  
  •  
  •  

Comments