పవన్ కాన్వాయ్ ప్రమాదంలో షాకింగ్ ట్విస్ట్..!?

Sunday, November 18th, 2018, 08:19:49 PM IST

గత కొద్ది రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రక్షక బృందం ఉన్న కారుకు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.కాకినాడ నుంచి రాజమండ్రి ఎయిర్ పోర్టుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది అని,పవన్ కు తృటిలో ప్రమాదం తప్పింది అని వార్తలొచ్చాయన్న సంగతి కూడా తెలిసిందే.అంతకు మునుపే ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ మీద జరిగిన హత్యా ప్రయత్న ఘటన కూడా సంచలనానికి దారి తీసింది,మళ్ళీ ఆ కొద్ది రోజుల్లోనే పవన్ కి సంబందించిన కాన్వాయ్ కి ప్రమాదం జరగడం జనసేన కార్యకర్తల్లో అలజడిని రేపింది.ఈ ప్రమాదం మాములుగా జరిగితే పరవాలేదు కానీ ఉద్దేశపూర్వకంగా జరిగితే మాత్రం సహించేది లేదు అని జనసేన కార్యకర్తలు మరియు అభిమానులు తెలిపారు.

అయితే ఇప్పుడు పవన్ బౌన్సర్లు ఉన్న కాన్వాయ్ కు జరిగిన ప్రమాదం మీద ఒక షాకింగ్ ట్విస్ట్ బయటకు వచ్చింది.నిజానికి పవన్ తన మీటింగ్ ను ముగించుకొని వెళ్ళేటప్పుడు ఈ ప్రమాదం జరగలేదు అని సభకు వెళ్తున్నప్పుడే ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తుంది,పవన్ బృందం మొత్తం మూడు కార్లలో సభకు వెళ్తుండగా మార్గ మధ్యలో లారీ డ్రైవర్ వేగంగా రివెర్స్ చేసి బ్రేక్ వేసే సమయంకి ముందు ఉన్న రెండు కార్లు వెళ్లిపోయాయని,అదే సమయంలో వెనుక ఉన్న కారు ప్రమాదానికి గురి కాబడింది అని తెలుస్తుంది.దీనితో ఆ లారీ డ్రైవర్ వెంటనే ఆపి అక్కడ నుంచి పరారీ అయ్యాడని ఆ తర్వాత వెంటనే పవన్ అప్రమత్తమయ్యి వారిని ఆస్పత్రికి తరలించారని తెలుస్తుంది.అయితే ఈ ప్రమాదం సరిగ్గా అదే సమయానికి ఉద్దేశపూరవకంగా జరిగిందా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అని పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.