బిగ్ న్యూస్ : ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి కి కరోనా పాజిటివ్..ఏపీ విఫలం.!

Monday, July 13th, 2020, 08:42:42 AM IST

ఇప్పుడు మన దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం అంతకంతకు పెరుగుతుంది. ఎందరో ఉన్నత స్థానాల్లో ఉన్న వారే ఊహించని విధంగా దీని భారిన పడుతుండటంతో అన్ని రంగాల్లోనూ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
ఇవే అనుకుంటే కరోనా మన రాజకీయ నాయకులను కూడా కరోనా వదల్లేదు.

గత కొన్ని రోజుల కితం తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకులకు షాకిచ్చిన కరోనా ఇప్పుడు ఏపీ రాజకీయ నాయకులకు అంటుకుంది. ఏపీ డిప్యూటీ సిఎం అంజద్ భాషా కు కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా నిర్ధారణ కావడం ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాలలో కలకలం రేపింది.

కేవలం అతనికి మాత్రమే కాకుండా అతని భార్య మరియు కుమార్తె కు కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా నిర్ధారణ అయ్యిందట. అయితే వారిని వెంటనే తిరుపతి స్విమ్స్ కు తరలించి వైద్యం అందించినప్పటికీ మళ్లీ హైదరాబాద్ ఆసుపత్రి చికిత్స ను తీసుకోడానికి వెళ్లిపోవడం ఆశ్చర్యకరంగా మారింది.

తెలంగాణా కంటే మెరుగైన చర్యలు ఏపీలో తీసుకుంటున్నామని చెప్పి ఓ పక్క వైసీపీ వారు చెప్తుంటే ఏకంగా ఆ పార్టీకు చెందిన నేతే ఇప్పుడు తెలంగాణ వెళ్లిపోవడం ఏపీ ప్రభుత్వం పై విమర్శలు కురిపిస్తుంది.