కిరాణా షాప్ లలో స్విప్ మెషీన్ లు .. సూపర్ స్ట్రాటజీ

Sunday, November 20th, 2016, 03:51:08 PM IST

swipe-machine
ఐదు వందల రూపాయల నోట్లు , 1000 రూపాయల నోట్ల రద్దు తో అన్ని వర్గాల ప్రజలలో ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ప్రజలకి చిల్లర కష్టాలు ఎక్కువ అయిపోయాయి. నగదు మార్పిడి ద్వారా బ్యాంకుల చేతిలో పెట్టె రెండు వేల నోట్ల రూపాయలు చేతిలో పెడుతున్నారు. వాటికి చిల్లర దొరకక రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏటీఎం లు కూడా ఎప్పటికప్పుడు పనిచెయ్యడం మానేయడంతో జనాలు చిల్లర ఖర్చులు మానేస్తున్నారు. అందరూ రిలయన్స్ ఫ్రెష్ లాంటి చోట్లకి వెళ్లి ఎక్కువ మొత్తం లో సరుకులు తీసుకుని ఖర్చు పెట్టుకుంటున్నారు. ఈ దెబ్బతో కిరాణా షాపులు దివాలా తీసే పరిస్థితి వచ్చెయ్యడం తో కొత్తగా కిరాణా దుకాణం లో కూడా స్వీపింగ్ మెషీన్ లు ప్రవేశపెట్టారు.కిరాణాషాపుల్లో స్వైపింగ్ మిష‌న్ల‌ను చూస్తున్న ప్ర‌జ‌లు ఊపిరి పీల్చుకుంటున్నారు. డెబిట్ కార్డుల‌తో షాపుల‌కు వెళ్తున్నారు. హైద‌రాబాద్‌లోని బాలాన‌గ‌ర్‌లోని ప్ర‌తి కిర‌ణాషాపులో ఇప్పుడు స్వైపింగ్ యంత్రాలు ద‌ర్శ‌నమిస్తున్నాయి. న‌గ‌దు ర‌హిత లావాదేవీలు జ‌ర‌పాల‌న్న ప్ర‌భుత్వ ల‌క్ష్యం మొత్తానికి ఇలా అమ‌ల‌వుతోంద‌న్న‌మాట‌!