వేశ్య పాత్రలో… శ్రద్ధ దాస్ ?

Sunday, May 20th, 2018, 05:04:39 PM IST

తెలుగులో హీరోయిన్ గా వెలగాలని కలలు గన్న హాట్ భామ శ్రద్ధ దాస్ ఆశలు మాత్రం నెరవేరలేదు. ఎన్ని సినిమాలు చేసిన కెరీర్ పరంగా ఒక్కటి సరైన విజయాన్ని అందించలేదు. దాంతో ఐటెం గిర్ల్ గా, హాట్ హాట్ పాత్రల్లో నటించింది. తాజాగా ఈ అమ్మడు ఓ వేశ్య పాత్రలో నటించేందుకు రెడీ అయింది. పైగా ఈ పాత్రతో మళ్ళీ తన కెరీర్ గాడిలో పడుతుందన్న నమ్మకంతో ఉంది మరి !! బాలీవుడ్ దర్శకుడు దీపక్ పాండే దర్శకత్వంలో లక్నో నేపథ్యంలో తెరకెక్కే సినిమాలో శ్రద్ధ దాస్ వేశ్య పాత్రలో కనిపిస్తుందని. శృంగార్ధన్ నేపథ్యంలో ఓ సాహెబా .. గుప్త బ్యాక్ డ్రాప్ లో సాగె రొమాంటిక్ కథ ఇదని, పరిస్థితుల దృష్ట్యా వేశ్యగా మారె యువతిగా శ్రద్ధ కనిపిస్తుందట. మరి శ్రద్ధ దాస్ ఈ సినిమా పై చాలా ఆశలు పెట్టుకోవడం విశేషం. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుంది.

  •  
  •  
  •  
  •  

Comments