పెళ్ళికి సిద్దమవుతున్న ప్రభాస్ హీరోయిన్ ?

Wednesday, January 24th, 2018, 03:09:08 PM IST


బాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న హాట్ భామ శ్రద్ధ కపూర్ ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ సరసన సాహో లో నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న శ్రద్ధ కపూర్ త్వరలో పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అయిందట ? అవును ఇప్పటికే దానికి సంబందించిన ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారట వాళ్ళ పేరెంట్స్ ? ఇదివరకే ఈ అమ్మడు ప్రేమాయనం కూడా సాగించిన నేపథ్యంలో శ్రద్ధ కపూర్ ప్రేమ పెళ్లి చేసుకుంటుందా .. లేక పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.